కలం, వెబ్ డెస్క్ : ముంబైలోని భిండి బజార్ ప్రాంతంలో ఉన్న శిథిలావస్థకు చేరిన ముసాఫిర్‌ఖానా భవనం కూల్చివేత పనులను బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రారంభించింది. పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) గతంలో తన కుటుంబంతో కలిసి ఇక్కడ నివసించినట్లు గుర్తింపు ఉండటంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా బీఎంసీ ఈ భవనాన్ని ప్రమాదకరమైన, శిథిలావస్థకు చేరిన సీ-1 నిర్మాణంగా వర్గీకరించింది. పాదచారులు, చుట్టుపక్కల ప్రయాణికుల భద్రతకు ఇది ముప్పుగా మారిన నేపథ్యంలో అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు.
భిండి బజార్ క్లస్టర్ పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ కూల్చివేత జరుగుతోంది. ప్రతిపాదిత అంతర్గత రహదారి నిర్మాణం, వెడల్పు పనులకు ఈ భవనంలోని కొంత భాగం అడ్డంకిగా మారినట్లు బీఎంసీ తెలిపింది. కూల్చివేత ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భిండి బజార్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భద్రతా నిబంధనలు పాటిస్తూ అధికారులు కూల్చివేత పనులను కొనసాగిస్తున్నారు.
Also Read : కాంగ్రెస్ విధానాల వల్లే దేశాభివృద్ది మందగించింది: ప్రధాని మోదీ
Follow Us On: X(Twitter)

