“రాజగోపాల్ రెడ్డి చెప్పింది నిజమే”.. కాంగ్రెస్​ ఎమ్మెల్యేకు రాజాసింగ్​ మద్దతు

కలం, వెబ్​ డెస్క్​: సీఎం రేవంత్​ రెడ్డిపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) సమర్థించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిస్థితి భిన్నంగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. కేవలం సీఎం, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారని ఆరోపిస్తూ రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం తెలిసిందే.

దీనిపై స్పందించిన రాజాసింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఆరోపణలలో తప్పేమీ లేదని ఆయన (Raja Singh) తెలిపారు. సోషల్ మీడియాలో ఈ మేరకు రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. “రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది నిజమే. తెలంగాణలో గూండా పరిపాలన నడుస్తోంది. అవినీతి విచ్చలవిడిగా ఉంది. రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాలకు నిధులు అందడం లేదు” అని రాజాసింగ్​ ఆరోపించారు.

నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం ఎమ్మెల్యేలు వేడుకుంటున్నారని రాజాసింగ్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధుల విషయంలో గానీ, అధికారులతో సమాచార మార్పిడిలో గానీ ఎలాంటి సమస్యలు లేవని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు ఎమ్మెల్యేల మాట వినడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో తనకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయని అయినా వివక్ష లేకుండా నిధులు విడుదల చేశారని రాజాసింగ్ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>