గురుకుల ఘటనలో కీలక మలుపు.. ఐదుగురు అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల (Addagudur Gurukul) పాఠశాలలో విద్యార్థినులపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. ఈ కేసులో పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు వంటమనిషి, ఇతర సిబ్బంది కలిపి మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏం జరిగిందంటే..?

తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన వెంకన్న అనే వ్యక్తి అడ్డగూడూరు గురుకుల పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా ఇతను పాఠశాలలోని విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని రూ.500, రూ.1000 ఇస్తాను వస్తారా అంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

వంటమనిషి వేధింపులు భరించలేక విద్యార్థినులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ వ్యవహారం బయటకు పొక్కితే పాఠశాల పరువు పోతుందని భావించిన ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా వంటమనిషి వెంకన్నను అక్కడి నుంచి పంపించివేశారు.

ఐదుగురి అరెస్ట్..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినులను లైంగికంగా వేధించిన ప్రధాన నిందితుడు, వంటమనిషి వెంకన్నపై పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే, నేరాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి, మెస్ అటెండెంట్ పూలమ్మ, ఆమె భర్త సోమయ్య, కాంట్రాక్టర్ మధులను కూడా నిందితులుగా చేర్చి మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>