ఇంకుడు గుంత తవ్వండి.. రూ.10 లక్షలు గెలుచుకోండి!

కలం, వెబ్​ డెస్క్​: ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడనుంది. ఈ క్రమంలో నీటి సంరక్షణకు వినూత్న పోటీకి శ్రీకారం చుట్టారు. ఇంకుడు గుంత నిర్మించిన వారికి ఏకంగా రూ.లక్షల బహుమతులు ప్రకటించారు. ‘ఆలివ్ మిఠాయి’ చేపట్టిన ‘ఇంటికో ఇంకుడు గుంత’ (One Home-One Recharge Pit) కార్యక్రమం పోస్టర్​ ను హైడ్రా కమిషనర్​ ఏవీ రంగనాథ్​ ఆవిష్కరించారు.

పోటీకి సంబంధించిన వివరాలు..

ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు తమ ఇంటి వద్ద ఇంకుడు గుంతకు నిర్మాణానికి సంబంధించిన వీడియో తీయాలి. ఆ వీడియోలను ఇన్​ స్ట్రాగ్రామ్ లో @oliveforsociety ఖాతాకు కొలాబరేషన్ పోస్ట్​ చేయాలి. ఈ వీడియోకు వచ్చే వ్యూస్​ ఆధారంగా విజేతలను ఎంపిక చేసి బహుమతులు ప్రకటించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.5 లక్షలు, రెండో బహుమతిగా రూ.3 లక్షలు, మూడో బహుమతిగా రూ.2 లక్షలు ఇలా మొత్తంగా రూ.10 లక్షల నగదు బహుమతులను  అందించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>