కలం, నేరడిగొండ : నేరడిగొండ మండలం కొకస్ మన్నూర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ యువకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలోని తన నివాసంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (Boath MLA) వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో యువత బీఆర్ఎస్లో చేరడం సంతోషకరమన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు. యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

