epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నా భార్యకు నా డాన్స్ నచ్చదు.. ట్రంప్ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​

కలం, వెబ్​ డెస్క్​: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)​ ప్రతినిత్యం వార్తలో నిలుస్తున్నారు. ఒకవైపు టారిఫ్​లతో భయపెడుతూ.. మరోవైపు ఇతర దేశాలపై దాడులు చేస్తూ తన పంతం నెగ్గించుకుంటున్నారు. దీంతో ట్రంప్ నెక్ట్స్​​ ఏంచేబోతున్నారు? అనేది ఆసక్తిగా మారుతోంది. భారత ప్రధాని మోదీనుద్దేశించి ‘నేను సంతోషంగా లేను’ అంటూ ఆయన చేసిన కామెంట్స్​ వైరల్​ అయ్యాయి. మరోసారి ఆయన ఫన్నీ కామెంట్స్​ చేశారు. ‘‘తాను డాన్స్ చేస్తుంటే అందరూ ఇష్టపడతారని.. కానీ, నా భార్య మెలానియాకు మాత్రం నేను డాన్స్ చేస్తే నచ్చదు”అని ట్రంప్ అన్నారు.

అధ్యక్షుడి హోదాలో ఉన్నవారు బహిరంగ సమావేశాల్లో డాన్స్ (Dance) చేయడం బాగుండదని మెలానియా అభిప్రాయమని ట్రంప్​ తెలిపారు. అయితే అమెరికాలో జరిగే పలు అధికారిక కార్యక్రమాల్లో ట్రంప్ డాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>