కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇళ్ల లబ్దిదారులకు గుడ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2014 కంటే ముందు ఉమ్మడి ఎంపీలో ఇందిరమ్మ సహా వివిధ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న పేదలకు తమ ఇళ్ల పట్టాలను (Telangana House Pattas) అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలో నిలిపివేసిన లేదా సేకరించిన పట్టా, పొజిషన్ సర్టిఫికేట్లను తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 7 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. ఈ మేరకు వివరాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించడం, ఇళ్ల పట్టాలపై లబ్దిదారులకు పూర్తి హక్కు ఇచ్చేవిధంగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని పొంగులేటి తెలిపారు. పేదల సొంతింటిపై హక్కును మరింత భద్రం చేస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దాదాపు దశాబ్దానికి పైగా లబ్ధిదారులు వాళ్ళ ఇళ్ల పట్టాలపై ఆందోళన చెందుతున్నారని.. వారికి పూర్తి భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పొంగులేటి ప్రకటనతో గత కొంతకాలంగా సర్టిఫికేట్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల నిరీక్షణకు తెరపడింది.
Also Read : వైభవ్.. సచిన్ అవుతాడా? కాంబ్లీ అవుతాడా?: కపిల్ దేవ్
Follow Us On : WhatsApp

