ఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌లు.. స‌రిహ‌ద్దు గ్రామాల్లో టెన్ష‌న్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌మ‌ను ఏపీ వాసులుగానే గుర్తించండి అంటూ ఒడిశా స‌రిహ‌ద్దులో ఉన్న సాలూరు మండలం కురుకుట్టి పంచాయతీ దొర్లతాడివలస (Dorla Thadivalasa) గిరిజ‌న ప్ర‌జ‌లు జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ఆశ్ర‌యించి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. మ‌న్యం జిల్లాలో కోఠియా (Kotia) గ్రామాల స‌రిహ‌ద్దు పంచాయ‌తీ ఎప్ప‌టి నుంచో వివాదాల‌కు కేంద్రంగా ఉంది. పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో త‌మ‌కు ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫునే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆయా గ్రామాల ప్ర‌జలు కోరారు. క‌లెక్ట‌ర్ అందుబాటులో లేక‌పోవ‌డంతో జాయింట్‌ కలెక్టర్‌ వైశాలినిని కలిసి వినతిపత్రం అందజేశారు.

కోఠియా ప్రాంతంలోని 21 గ్రామాల పరిధిలో స‌రిహ‌ద్దు వివాదం నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోందని గ్రామస్తులు ఆరోపించారు. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ సమయంలోనూ ఒడిశా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. దీంతో రానున్న పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. తరతరాలుగా తాము ఏపీతోనే అనుబంధం కలిగి ఉన్నామని, తమ గ్రామాల ప్రజలు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ఏపీ నుంచే పొందుతున్నారని వివరించారు. విద్య, వైద్యం, ఇతర ప్రభుత్వ సేవలు కూడా ఏపీ స‌ర్కార్‌ ద్వారానే అందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కోఠియా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, తమ హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరారు.

Also Read : వైభవ్.. సచిన్ అవుతాడా? కాంబ్లీ అవుతాడా?: కపిల్ దేవ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>