కలం, సినిమా: యువ నటుడు తేజ సజ్జా (Teja Sajja) నిశ్చితార్థం హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు రాఘవేంద్రావు, ప్రశాంత్ వర్మ, కార్తీక్ ఘట్టమనేని, నటులు రవితేజ, రానా, శివాజీ, వరలక్ష్మి శరత్‌కుమార్ దంపతులు, నిర్మాతలు విశ్వప్రసాద్, సాహూ గారపాటి వేడుకకు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా తేజ సజ్జా వివాహం జరగనుంది. తమది పెద్దలు కుదిర్చిన సంబంధమని, వధువు కుటుంబానికి సినీ పరిశ్రమతో సంబంధం లేదని తేజ ఇటీవల చెప్పారు. అమ్మాయి కుటుంబం టెక్నాలజీ వ్యాపారంలో ఉన్నట్లు వెల్లడించారు.
Also Read : నటుడు శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెళ్లి పీటలెక్కనున్న పెద్ద కుమారుడు!
Follow Us On : WhatsApp

