కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్యం (Yamuna River Pollution) కోరల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమల కాలుష్యం వల్ల నదిలో తెల్లటి నురగలు పేరుకుపోయాయి. ఈ క్రమంలో హిందువులు ప్రత్యేకంగా జరుపుకునే ఛత్ పూజలు నిర్వహించడానికి కాలిందీ కుంజ్ ప్రాంతంలోని యమునా నది వద్దకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. సంప్రదాయంలో భాగంగా కొందరు భక్తులు నదిలోకి దిగి పూజలు చేశారు. విషపు నురగలు అని తెలియని భక్తులు నదిలోకి దిగి పూజలు నిర్వహించారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నురగలను చూసి కొందరు మేఘాలు వలే కనిపిస్తున్నాయని కామెంట్స్ పెడుతున్నారు. అయితే, అవి కాలుష్యంతో నిండిన విషపు నురగలని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రతి సంవత్సరం ఛత్ పూజ (Chhath Puja) సందర్భంగా యమునా నది (Yamuna River ) వద్దకు భారీగా భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహిస్తుంటారు.
Also Read : తేజ సజ్జా ఎంగేజ్మెంట్ వేడుకలో సినీ ప్రముఖల సందడి
Follow Us On : WhatsApp

