కలం, వెబ్ డెస్క్: కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ప్రముఖ మొబైల్ కంపెనీలు చేదు వార్త అందించాయి. దేశియ మార్కెట్ లో మంచి గిరాకీ ఉన్న శాంసంగ్, షావోమీ బ్రాండ్ల ఫోన్ల ధరలను పెంచేశాయి (Smartphone Price Hike). ఈ రెండు కంపెనీలకు చెందిన మొత్తం 41 స్మార్ట్ ఫోన్ వేరియంట్ల ధరలను 18.75 శాతం వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి (సోమవారం) నుంచే అమల్లోకి వచ్చాయి.
వీటిలో శాంసంగ్ (Samsung) గెలాక్సీ A, F సిరీస్‌లకు చెందిన 22 వేరియంట్లు ఉండగా, షావోమీ రెడ్మీ (Xiaomi) పోర్ట్‌ఫోలియోకు చెందిన 19 వేరియంట్లు ఉన్నాయి. మోడల్, ర్యామ్, స్టోరేజీ సామర్థ్యం ఆధారంగా ఒక్కో ఫోన్ పై వెయ్యి రూపాలయ నుంచి 4వేల వరకు ధరలు పెరిగాయి. శాంసంగ్ హ్యాండ్ సెట్ల ధరలు 3.13 శాతం నుంచి 9.52 శాతం వరకు పెరిగాయి. షావోమీ స్మార్ట్ఫోన్లు 4.26 శాతం నుంచి 18.75 శాతం వరకు ధరలు పెరిగాయి.
శాంసంగ్ ఫోన్ల ధరలు..
శాంసంగ్ గెలాక్సీ A07 రూ.2000 చొప్పున పెరగడంతో 4GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.రూ.20,999 నుంచి రూ.22,999కు చేరింది. అలాగే గెలాక్సీ F17, A17 5G మోడళ్ల ధరలు కూడా రెండు వేలు పెరిగాయి. ఎంపిక చేసిన గెలాక్సీ A57 వేరియంట్ల ధరల్లోనూ పెరుగుదల (Smartphone Price Hike) నమోదయింది.
షావోమీ ఫోన్లపై 18.75 శాతం ధరల పెంపు
షావోమీ రెడ్మీ స్మార్ట్ఫోన్ల ధరల్లో గరిష్ఠంగా 18.75 శాతం పెరిగింది. రెడ్ మీ A7 ప్రో 5G (4GB+128GB) ధర రూ.3 వేలకు పెరిగి రూ.18,999కు అందుబాటులో ఉంది. అలాగే రెడ్మీ నోట్ 17 5G వేరియంట్ల ధరలు కూడా రూ.3 వేల మేర పెరిగాయి. NOTE 17 Pro 5G మోడళ్ల ధరలు ఏకంగా రూ.4,000 పెరిగాయి. షావోమీకి చెందిన 19 వేరియంట్లలో సగటు ధరల పెరుగుదల 10.02 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : ఐసీసీ ఛైర్మన్‌గా జై షా మళ్లీ ఎన్నిక!
Follow Us On: X(Twitter)

