ఇండియ‌న్ ఒలింపిక్‌ సంఘం అధ్యక్ష రేసులో పీటీ ఉషా..!

క‌లం, వెబ్ డెస్క్‌: భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు పీటీ ఉషా (PT Usha)కు మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు లైన్ క్లియ‌ర్ అయ్యింది. డిసెంబర్ 5న జరగనున్న ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారి విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ఐస్ హాకీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మహిళా ప్రతినిధిగా పీటీ ఉషా పేరు 28వ స్థానంలో నమోదైంది. ఆమెతో పాటు అదే అసోసియేషన్ పురుష ప్రతినిధిగా హర్జిందర్ సింగ్ పేరు కూడా జాబితాలో ఉంది.

ఓటర్ల జాబితాలో పీటీ ఉషా, హర్జిందర్ సింగ్ పేర్లను చేర్చడంపై వచ్చిన అభ్యంతరాలను ఎన్నికల అధికారి తిరస్కరించినట్లు తెలుస్తోంది. పీటీ ఉషా గతంలో ఎస్‌ఓఎం ఎన్నికల్లో పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. అయితే ఉషాకు ఇప్పుడు ఐఓఏ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసేందుకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో చోటు దక్కడంతో ఐఓఏ అధ్యక్ష పదవికి పోటీ చేయ‌డం దాదాపు ఖ‌రారైంది. డిసెంబర్ 5న ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎన్నికల‌కు పోలింగ్ జరుగనుంది. పీటీ ఉషా రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తారా? చేస్తే ఎన్నికల బరిలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>