కలం, వెబ్‌డెస్క్: అమెరికాలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం న్యూయార్క్‌లోని క్వీన్స్ ఓం శక్తి ఆలయంలో నిర్వహించిన దుర్గాపూజ వేడుకల్లో మమ్దానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇల్లినాస్‌లో హిందూ ఆలయాలపై జరిగిన సామూహిక కాల్పుల ఘటనపై స్పందించారు. హిందూ అమెరికన్లు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా పూజలు చేసుకునే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకు తగిన వాతావరణం కల్పించడం అందరి బాధ్యత అన్నారు. హిందువులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ మతాన్ని ఆచరించే వాతావరణం కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
అక్టోబర్ 11న ఇల్లినాయిస్‌లోని అరోరా నగరంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి వేడుకల సమయంలో కాల్పుల ఘటన జరిగింది. అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్ అనే యువకుడు ఏఆర్-స్టైల్ రైఫిల్‌తో ఆలయంపై దాడికి యత్నించాడు. అయితే తుపాకీ జామ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో నాజీ గుర్తులు, శ్వేతజాతీయుల ఆధిపత్యాన్ని సమర్థించే మేనిఫెస్టోను స్వాధీనం చేసుకున్నారు.

