సీత యోధురాలి పాత్రపై విమర్శలు.. దర్శకుడు నితేశ్​ తివారీ ఏమన్నారంటే?

కలం, వెబ్ డెస్క్: నితేశ్​ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ’ చిత్రంలో సీత పాత్రలో సాయి పల్లవి నటించిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో సీతను ఒక యోధురాలిగా, పోరాట సన్నివేశాల్లో చూపించడంపై ఇటీవల కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ విమర్శలపై దర్శకుడు నితేశ్​ తివారీ స్పందించారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సీత పాత్రను యోధురాలిగా మలచడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. “సంస్కృతంలోని అద్భుత రామాయణం, 15వ శతాబ్దానికి చెందిన ఒడియా బిలంక రాయాయణం వంటి గ్రంథాల్లో సీత పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. వాటిలో ఆమె కేవలం కష్టాలను ఓర్చుకునే మహిళగానే కాకుండా, శక్తిమంతమైన వీరనారిగా, విశ్వశక్తి స్వరూపిణిగా కనిపిస్తారు. కొన్ని కథనాల ప్రకారం, శ్రీరాముడికి ఆపద ఎదురైనప్పుడు సీత మహాకాళి అవతారమెత్తి సహస్ర రావణుడిని సంహరిస్తుంది. పలు ప్రాంతీయ రామాయణాల్లో సీతను ఇలాగే చిత్రీకరించారు. ఇది మేము కొత్తగా చేసిన ప్రయోగం కాదు. ఆ ప్రాచీన కథల స్ఫూర్తితోనే మా సినిమాలో సీత పాత్రను తీర్చిదిద్దాం” అని నితేశ్ వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>