కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన కొత్త పింఛన్ (Telangana New Pensions) లబ్ధిదారుల తుది జాబితా ఖరారైంది. మొత్తం 4,63,857 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లను మంజూరు చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19వ తేదీన లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా పింఛన్ సొమ్మును జమ చేసేందుకు సెర్ప్ (SERP) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నగదు బదిలీకి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలపడంతో పాటు, ప్రభుత్వం అదనపు బడ్జెట్‌ను కూడా మంజూరు చేసింది.
కొత్తగా మంజూరైన 4,63,857 పింఛన్లలో అత్యధికంగా 2,77,894 మంది వితంతువులు ఉండగా, 1,00,224 మంది దివ్యాంగులు ఉన్నారు. వీరితో పాటు 53,844 మంది ఒంటరి మహిళలు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులకు ఈ కొత్త పింఛన్లు మంజూరయ్యాయి.

