కేంద్రాన్ని రూ.30 వేల కోట్ల సాయం కోరిన సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా తెలంగాణలో కరువు ఏర్పడిందని.. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.30 వేల కోట్ల సాయం చేయాలని కేంద్రాన్ని సీఎం కోరారు. అలాగే మోదీని ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా గేమ్స్ కు ఆహ్వానించారు. ఈ అంశాలపై ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి చర్చించారు.

గోదావరి కావేరీ నదుల అనుసంధానంపై ప్రధానితో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడి హట్టి వద్ద నిర్మించనున్న కొత్త ప్రాజెక్టుకు సహకరించాలని.. ఇందుకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ అనుమతులపైనా చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర క్రీడా, యువజ వ్యవహారాల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

Also Read : ఐఏఎస్ అధికారి రాజీవ్‌కు గాయాలు.. ఫోన్‌లో పొంగులేటి పరామర్శ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>