అక్వాన్ తుఫాన్.. తెలంగాణలో 3 రోజులు వర్షాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంపై ‘అక్వాన్’ తుఫాన్ (Cyclone Akvan) ప్రభావం ఉండనుందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండంగా ఆదివారం తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈ తుఫాన్ కారణంగా ముఖ్యంగా ఏపీలోని కోస్తా తీరానికి ముప్పు పొంచి ఉందని తెలిపారు. రాగల 24 గంటల్లో వాయుగుండం తుఫాన్‌గా, మంగళవారం నాటికి తీవ్ర తుఫాన్‌గా మారనుందని అంచనా వేశారు. ఉత్తర కోస్తాలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

వాయుగుండం తుఫాన్ గా మారితే.. అక్వాన్ తుఫాన్ (Cyclone Akvan) గా నామకరణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీతోపాటు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. రానున్న శుక్రవారం, శనివారం ఆదివారం (20,21,22 తేదీల్లో) రోజుల్లో ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 21, 22 తేదీల్లో మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.

Also Read : తనిష్క్ నగల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు అరెస్ట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>