కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ధామ్(Badrinath Dham)లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శీతాకాలం కోసం ఆలయ తలుపులు మూసివేయడానికి సరిగ్గా ఒకరోజు ముందు నేడు ధామ్‌లో భారీగా మంచు కురవడం (Snowfall) ప్రారంభమైంది. దీనితో ఆ ప్రాంతమంతా తీవ్రమైన చలిగాలులు వీస్తూ గడ్డకట్టే వాతావరణం నెలకొంది. అయినప్పటికీ, తీవ్రమైన చలిని, మంచు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు శ్రీ బద్రీ విశాల్ స్వామి వారి దివ్య దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
నవంబర్ 16వ తేదీ సాయంత్రం శీతాకాలం కోసం శ్రీ బద్రీ విశాల్ ఆలయ తలుపులను శాస్త్రోక్తంగా మూసివేయనున్నారు. తలుపుల మూసివేతకు సంబంధించిన ప్రత్యేక పూజలు, ధార్మిక క్రతువుల ఏర్పాట్లు ప్రస్తుతం ధామ్(Badrinath Dham)లో తుది దశకు చేరుకున్నాయి. ఆలయ మూసివేతకు ముందు కురుస్తున్న ఈ అకాల మంచు వర్షంతో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా మంచు దుప్పటి కప్పుకుని మరింత చల్లగా మారాయి.
Also Read : తనిష్క్ నగల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు అరెస్ట్!
Follow Us On: X(Twitter)

