బిర్సా ముండా జయంతి వేడుకలు.. గిరిజనుల అభివృద్ధికి మోదీ భారీ కానుక!

కలం, వెబ్ డెస్క్: జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా ఢిల్లీలో భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి (Birsa Munda Jayanti) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

బిర్సా ముండా 151వ జయంతి(Birsa Munda Jayanti)ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, జీవనోపాధి బలపేతం చేసేందుకు సుమారు రూ.3 వేల కోట్ల విలువైన 246 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి, శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొని బిర్సా ముండా త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో గిరిజన సంప్రదాయ నృత్యాలు, జానపద కళా ప్రదర్శనలను నిర్వహించారు.

Also Read : ఆకాశయానానికి బ్రేక్: ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల నరకయాతన!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>