తనిష్క్ నగల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని తనిష్క్ నగల షోరూమ్‌లో జరిగిన భారీ చోరీ (Tanishq Robbery) కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నవంబర్ 12న తనిష్క్ షోరూమ్‌లో దుండగులు భారీ దోపిడీకి పాల్పడి, సుమారు 15 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చోరీకి వారం రోజుల ముందు, అంటే నవంబర్ 5న నిందితులు దుకాణం వెనుక వైపు నుంచి రెక్కీ నిర్వహించినట్లు సీసీ కెమెరా దృశ్యాల ద్వారా గుర్తించారు.

ఈ దర్యాప్తులో భాగంగా మదురైకి చెందిన యూట్యూబర్ నిషాంత్ కృష్ణన్‌పై పోలీసులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు అతడి ఇంట్లో సుమారు 15 గంటల పాటు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అయితే పోలీసుల తనిఖీల సమయంలో నిషాంత్ ఇంట్లో లేకపోవడంతో అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

చోరీకి పాల్పడిన సమయంలో తాను ధరించిన దుస్తులను ఆధారాలు దొరకకుండా నిషాంత్ తన పొలంలో కాల్చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే నిషాంత్ స్నేహితురాలు, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిషాంత్ కృష్ణన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>