ఆకాశయానానికి బ్రేక్: ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల నరకయాతన!

కలం, వెబ్ డెస్క్ : అమెరికా వ్యాప్తంగా విమానాశ్రయాల్లో నెలకొన్న అత్యవసర పరిస్థితి (US Flight Disruptions) కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా విధించిన గ్రౌండ్‌ స్టాప్‌ను ఎత్తివేసినప్పటికీ, విమాన సర్వీసుల అంతరాయం ఇంకా కొనసాగుతోంది.

ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను విమానాశ్రయంలోనే వదిలేసి, ఖాళీ విమానాన్ని వాషింగ్టన్‌ డీసీకి తరలిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బందే తమకు చెప్పారని ప్రయాణికులు పేర్కొంటున్నారు. విమానాన్ని అధికారికంగా రద్దు చేయకపోవడంతో పాటు, తదుపరి ప్రయాణంపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వారంతా గందరగోళానికి గురయ్యారు. ఎయిర్‌లైన్స్‌ వ్యవహారశైలిపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు ఐదు గంటల పాటు విమానాలను నిలిపివేయడంతో దేశంలోని ప్రతి ఎయిర్‌పోర్టులోనూ విమానాలు, సిబ్బంది షెడ్యూళ్లు పూర్తిగా తారుమారయ్యాయి. సియాటిల్‌–టకోమా విమానాశ్రయంలో ఏకంగా 234 విమానాలు ఆలస్యంగా నడవగా, 163 సర్వీసులు రద్దయ్యాయి. శనివారం షెడ్యూల్‌ అయిన మొత్తం 41,000 విమానాలలో 4,000 నుండి 5,000 వరకు రద్దయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో పాత రాగి వైర్ల స్థానంలో ఫైబర్-ఆప్టిక్ కేబుల్‌ను అమర్చేందుకు కాంట్రాక్టర్ L3Harris చేపట్టిన అప్‌గ్రేడ్ పనులే ఈ సాంకేతిక అంతరాయానికి కారణమై ఉండవచ్చని రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ వెల్లడించారు. 2001 తర్వాత అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు ఇంత సుదీర్ఘంగా అంతరాయం కలగడం గత 25 ఏళ్లలో ఇదే మొదటిసారి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>