మారుతి ఇన్ హోటల్‌లో పోలీసుల తనిఖీలు.. కీలక ఆదేశాలు జారీ

కలం, నిర్మల్ : జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌లో ఉన్న మారుతి ఇన్ హోటల్‌లో పోలీసులు (Nirmal Police) శనివారం తనిఖీలు నిర్వహించారు. రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల సందర్భంగా లాడ్జిలో బస చేసే అతిథుల వివరాలు, ఆధార్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించిన తర్వాతే గదులు కేటాయించాలని నిర్వాహకులకు సూచించారు. లాడ్జి యజమానులు, సిబ్బంది పోలీస్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. హోటళ్లు, లాడ్జీల్లో ఎలాంటి చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకూడదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో రూరల్ ఎస్సై లింబాద్రి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>