జపాన్ మాస్టర్స్ ఫైనల్‌కు లక్ష్య సేన్

కలం, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ (Lakshya Sen) బీడబ్ల్యూఎఫ్ టూర్‌లో వరుసగా రెండో ఫైనల్‌కు చేరారు. శనివారం జరిగిన కుమమోటో మాస్టర్స్ జపాన్ సూపర్ 500 సెమీఫైనల్‌లో ఇండోనేషియా ఆటగాడు అల్వి ఫర్హాన్‌పై 21-12, 15-21, 21-11 తేడాతో గెలుపొందారు. 70 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను సేన్ 9-3 ఆధిక్యంతో దూకుడుగా మొదలుపెట్టారు. మధ్యలో ఫర్హాన్ 10-7తో పోటీనిచ్చినా, సేన్ పట్టు బిగించి 21-12తో గేమ్ గెలిచారు. రెండో గేమ్‌లో ఫర్హాన్ వరుసగా ఏడు పాయింట్లు సాధించి 11-4 ఆధిక్యంలోకి వెళ్లాడు. సేన్ గట్టిగా ప్రయత్నించినా 15-21తో గేమ్ కోల్పోయారు. టోర్నీలో సేన్ ఓడిన తొలి గేమ్ ఇదే.

నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సేన్ 5-2 ఆధిక్యంతో ఆరంభించి, 8-6 వద్ద వరుసగా ఐదు పాయింట్లు గెలిచారు. ఆ తర్వాత 21-11తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. ఫర్హాన్‌తో ఆడిన మూడు మ్యాచ్‌లలో సేన్‌కు ఇదే తొలి విజయం. ఈ ఏడాది మార్చిలో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన సేన్, ఈ నెలలో జర్మనీలో హైలో ఓపెన్ గెలిచారు. గతేడాది కుమమోటో సెమీస్‌లో ఓడిన ఆయన, ఈసారి ఫైనల్‌కు చేరారు. టైటిల్ పోరులో కోకి వటనాబే లేదా కున్లావుట్ విటిడ్సార్న్‌తో తలపడనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>