యూఎఫ్‌సీకీ జిమ్ మిల్లర్ రిటైర్మెంట్!

కలం, స్పోర్ట్స్ : యూఎఫ్‌సీ రికార్డుల కంటే కుటుంబాన్ని చూసుకోవడమే ముఖ్యమని 43 ఏళ్ల వెటరన్ ఫైటర్ జిమ్ మిల్లర్ ( Jim Miller) తెలిపారు. కెరీర్ చివరి దశకు చేరిన ఆయన, శనివారం న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగే యూఎఫ్‌సీ 334లో టెరెన్స్ మెకిన్నీతో తలపడనున్నారు. తన 50వ ఫైట్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆరోగ్యం సహకరిస్తే 2027లో చివరి పోరు జరిగే అవకాశం ఉంది. 2025లో తన కుమారుడు వ్యాట్‌కు క్యాన్సర్ సోకడం తన ఆలోచనా విధానాన్ని మార్చేసిందని మిల్లర్ చెప్పారు. 13 నెలల చికిత్స సమయంలో కుటుంబానికి అందుబాటులో ఉండటమే అసలైన విజయంగా భావించానని తెలిపారు.

ఏప్రిల్ 2026లో కుమారుడు పూర్తిగా కోలుకున్నాక, మే నెలలో జరిగిన యూఎఫ్‌సీ 328లో మిల్లర్ విజయం సాధించారు. శనివారం జరిగే పోరుకు ముందు ప్రత్యర్థి టెరెన్స్ మెకిన్నీ నిర్ణీత బరువు కంటే 4.2 పౌండ్లు ఎక్కువగా ఉండటంతో, తన ఫీజులో 30 శాతాన్ని మిల్లర్‌కు జరిమానాగా ఇచ్చారు. లైట్‌వెయిట్‌లో ఇదే చివరి ఫైట్ అని మెకిన్నీ వెల్లడించారు. ఇప్పటివరకు యూఎఫ్‌సీలో అత్యధికంగా 47 ఫైట్లు, 28 విజయాలు సాధించిన మిల్లర్.. 30 విజయాల మైలురాయికి కేవలం రెండు గెలుపుల దూరంలో ఉన్నారు. 2016 నుంచి లైమ్ వ్యాధితో బాధపడుతున్నా, వయసురీత్యా వచ్చే మార్పులను అంగీకరిస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>