నెహ్రూ జయంతి వేళ చిన్నారులతో హరిత సంకల్పం

కలం, కొత్తగూడెం: బాలల దినోత్సవం, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లోని సెయింట్ మేరీస్ పాఠశాలలో శనివారం పర్యావరణ పరిరక్షణ (Green Initiative) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రకృతి హరిత దీక్షకురాలు నైనిక ఈ కార్యక్రమంలో పాల్గొని, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నైనిక మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఒక మొక్కను నాటి, అది పెరిగి పెద్దయ్యే వరకు సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారానే కాలుష్యాన్ని అరికట్టి, భావితరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన భవిష్యత్తును అందించగలమని పేర్కొన్నారు. ఈ హరిత కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల పోలిశెట్టి, ఉపాధ్యాయులు కల్పన, ప్రణవి, సంజన, వరుణి తదితరులు పాల్గొని మొక్కలు నాటడంలో విద్యార్థులను ప్రోత్సహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>