చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి

కలం, నిర్మల్ : నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో గల బాలసదనంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు న్యాయ సేవాధికార చట్టాలు, ఉచిత న్యాయ సహాయం, బాలల హక్కులు (Children Rights), న్యాయ సేవల వినియోగంపై అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు అవసరమైనప్పుడు న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, బాలకేంద్రం నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>