ఆ పుస్తకం కేసీఆర్‌కు పంపిస్తా: మహేశ్ గౌడ్

కలం, వెబ్ డెస్క్: సోనియా గాంధీ జీవిత చరిత్ర పుస్తకాన్ని కేసీఆర్‌, కిషన్ రెడ్డికి పంపిస్తానని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. భారత్ సమ్మిట్, రాహుల్ గాంధీ పర్యటనపై మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘తెలంగాణలో అమలవుతున్న పథకాలపై రాహుల్ గాంధీ నన్ను అడిగారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సోనియా గాంధీ జీవిత చరిత్ర పుస్తకం బాగుందని చెప్పారు, మూడు నెలల్లో తెలుగు కాపీలు విడుదలవుతాయని రాహుల్ చెప్పారు’ అని మహేశ్ గౌడ్ తెలిపారు.

రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు సోనియా గాంధీ పుస్తకాలను అందిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ‘భారత్ సమ్మిట్‌లో విదేశీ ప్రతినిధులకు కూడా పుస్తకాలు ఇచ్చాం. రాహుల్ గాంధీని రోజూ కుర్తా ఫైజామా వేసుకోవాలని కోరగా.. నవ్వుతూ తనకు చాక్లెట్ ఇచ్చారు’ అని మహేశ్ గౌడ్ చెప్పారు. రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ అంశం, తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితిపై తమ మధ్య చర్చ జరిగిందన్నారు.

ఆయన పక్కన పరుగెత్తడం అదృష్టం..

గిగ్ వర్కర్స్ ర్యాలీలో రాహుల్ గాంధీ బైక్ వెనుకాల పరుగెత్తడంపై మహేశ్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎక్కన బైక్ స్కిడ్ అవడంతో వెనుకాల ఉండిపోయాను. రాహుల్ ఈ విషయాన్ని గుర్తించి రమ్మని పిలిచారు. రాహుల్ గాంధీ పక్కన పరుగెత్తడం నా అదృష్టం. అధినాయకుడి పక్కన నడిచే అవకాశం రావడం మహాభాగ్యం. రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు రావడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. భారత్ సమ్మిట్ విజయవంతమైంది. రాహుల్ గాంధీ సంపన్న కుటుంబంలో పుట్టినా.. ఆయన ఆలోచనలు పేదలు, సామాన్యుల కోసమే ఉంటాయి’ అని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>