కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స ఖర్చు తగ్గించాలి: ఎంపీ కడియం కావ్య

కలం, హనుమకొండ: వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్సను (Cochlear Implant Treatment) తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (MP Kadiyam Kavya ) అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ చికిత్సకు రూ.10 నుంచి 15 లక్షలు, ప్రభుత్వ వైద్య వ్యవస్థలో సుమారు రూ.6 లక్షలు ఖర్చవుతోందని తెలిపారు.

హనుమకొండలో నిర్వహించిన ‘సీఐ ఫ్రంటియర్స్-2026’ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతమైన స్క్రీనింగ్ వ్యవస్థ ఉండాలని సూచించారు. వ్యాధి లక్షణాల ఆధారంగా చికిత్సకే పరిమితం కాకుండా మూలకారణాలను గుర్తించేలా వైద్య పరిశోధనలు విస్తరించాలని, పర్యావరణ కాలుష్యం, ఆహార కల్తీ, మైక్రోప్లాస్టిక్స్ ప్రభావాలపైనా అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్‌టీ వైద్యులు డాక్టర్ మోహన్ కామేశ్వరన్, డాక్టర్ సుదీప్, డాక్టర్ ద్వారకనాథ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>