కలం, నిజామాబాద్ బ్యూరో : దివ్యాంగ విద్యార్థులైనప్పటికీ () దేశ నాయకులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అందంగా ముస్తాబై బాలల దినోత్సవం (Childrens Day) రోజు దేశం మీద ప్రేమ , దేశ ఐక్యతను మరింత పెంపొందించే విధంగా సాంస్కృతిక ప్రదర్శన ద్వారా చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి అభినందించారు. నిజామాబాద్ నగరంలోని మారుతీ నగర్ స్నేహ సొసైటీ (Sneha Society) ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో బాలల దినోత్సవ చిల్డ్రన్స్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశ స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణతో విభిన్న పలు సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు.. ప్రతి ఒక్కరికి ముందుగా బాలల దినోత్సవం వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ దేశ ఐక్యత , స్వాతంత్ర్యం కోసం పిల్లలంటే ఎందుకు అంత మక్కువ అన్న విషయాలను క్లుప్తంగా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు.
మహిళలు అన్నింటిలో కూడాను ఆడపిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ప్రతి విషయంలో ముందంజలో ఉండాలని ఆకాంక్ష ఆయనలో ఉందని తెలిపారు. స్త్రీ ఒక శక్తి స్వరూపిణి అని కొనియాడారు. ఎందుకంటే పూర్వకాలం నుండి ఇప్పటివరకు దేవత మూర్తులు అందరూ కూడాను అమ్మవారి రూపంలో వివిధ పేర్లతో కోలవడం మొక్కడం జరుగుతుందన్నారు. దివ్యాంగ విద్యార్థుల అయినప్పటికీ సకలాంగులకు దీటుగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల రూపాలలో ముస్తాబై పాశ్చాత్య పోకడాలకు పోకుండా సినిమా పాటలు లేకుండా కేవలం దేశానికి సంబంధించిన అన్నదాతలకు సంబంధించిన పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని వారు పేర్కొన్నారు.
పిల్లలు దైవంతో సమానమని వారు సంతోషంగా బాల్యాన్ని ఆస్వాదించాలని వారికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని సూచించారు. అనంతరం పలు సాంస్కృతిక ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా స్వతంత్ర సమరయోధుల వేషధారణలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు, సాంస్కృత ప్రదర్శనలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అదేవిధంగా స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కే. రమేశ్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ కోశాధికారి తాటి సుధాకర్, వినయ, టాటా ఏఐఏ ప్రతినిధులు నరేష్ రావు శ్రావణి, మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు , సిబ్బంది, అంద ప్రత్యేక పాఠశాల విద్యార్థులు విద్యార్థులు సిబ్బంది మరియు దివ్యాంగ బాలల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

