కాంగ్రెస్​ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.. రాహుల్​ పై ఈటల ఫైర్​

కలం, వెబ్​ డెస్క్​: కాంగ్రెస్​ పార్టీ, రాహుల్​ గాంధీపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender)​ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్​.. రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చిన ఘనత కూడా ఆ పార్టీదేనని ఆరోపించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతున్న తీరు, వ్యవహారశైలి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఇంత చిల్లర వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారా? అనిపిస్తోందని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు. విదేశీ గడ్డపై భారత ఎన్నికల వ్యవస్థను, సుప్రీంకోర్టును అపహాస్యం చేసేలా రాహుల్​ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

త్యాగాల పునాదుల మీద భారతదేశం నిర్మితమైందని, ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న సైనికులను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో మిలటరీ వ్యాన్ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఈటల ఆరోపించారు. సొంత క్యాబినెట్ మంత్రులనే జైలుకు పంపిన చరిత్ర కాంగ్రెస్ ది అని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కూడా రాహుల్​ గాంధీ దృష్టి సారించాలని ఎంపీ ఈటల (Eatala Rajender) సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కళ్లలో మట్టి కొట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం అసాధ్యమని తాను ముందే చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసా కూడా సక్రమంగా అందడం లేదని ఆయన ఆరోపించారు. ఎల్​ నినోతో కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలో సమ్మిట్‌ల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>