గిగ్ వర్కర్లకు రేవంత్ సర్కార్ భరోసా.. కొత్త పథకం ప్రారంభం!

కలం, వెబ్ డెస్క్ : యాప్ ఆధారిత డెలివరీ, రవాణా తదితర రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లోని జయభేరి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన గిగ్ వర్కర్ల బహిరంగ సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ‘గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని’ (Gig Workers Policy) అధికారికంగా ప్రారంభించారు.

12 ప్రధాన హామీలతో రూపొందించిన ఈ పాలసీ ద్వారా కార్మికులకు ఉద్యోగ భద్రత, రూ.10 లక్షల ప్రమాద బీమాతో పాటు పలు సంక్షేమ ప్రయోజనాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమల్లోకి తెచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్లకు ఆర్థిక, సామాజిక భరోసా లభించనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>