భారత్ సమ్మిట్ నుంచి బైక్ ర్యాలీ దాకా.. రాహుల్, రేవంత్ ఫుల్ బిజీ!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్‌లో నిర్వహించనున్న పలు కీలక కార్యక్రమాల్లో కలిసి పాల్గొననున్నారు. భారత్ సమ్మిట్ సదస్సులతో పాటు తెలంగాణ గిగ్ వర్కర్ల సంక్షేమ కార్యక్రమాల్లో వీరు పాలుపంచుకుంటారు.

ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే భారత్ సమ్మిట్ వేదికగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు ఆసియా దేశాల నాయకులతో జరిగే క్లోజ్డ్ డోర్ సమావేశంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఇదే వేదికపై అమెరికా, యూరోపియన్ దేశాల నాయకులతో నిర్వహించే మరో ప్రత్యేక సమావేశంలో వీరు భేటీ అవుతారు.

సదస్సుల అనంతరం ఉదయం 11 గంటలకు జయభేరి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత పథకాన్ని రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొంటారు. ర్యాలీ ముగిసిన తర్వాత జయభేరి గ్రౌండ్‌లో జరిగే గిగ్ వర్కర్ల బహిరంగ సభలో వీరిద్దరూ ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 3 గంటలకు నోవోటెల్ హోటల్‌లో జరగనున్న భారత్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో (Valedictory Session) రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడంతో నేటి అధికారిక కార్యక్రమాలు ముగుస్తాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>