హైదరాబాద్​ చేరుకున్న రాహుల్​ గాంధీ

కలం, వెబ్​ డెస్క్​: కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్​ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్​ చేరుకున్నారు. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్​ పోర్టులో ఆయనకు సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్​ గౌడ్​, మంత్రులు పొన్నం ప్రభాకర్​, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కాంగ్రెస్​ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్​ సమ్మిట్ –2026 తో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాహుల్​ గాంధీ హైదరాబాద్​ కు వచ్చారు. సీఎం రేవంత్​ రెడ్డితో కలిసి ఆయా సమావేశాల్లో పాలుపంచుకుంటారు.

హైదరాబాద్​ ఇంటర్నేషనల్​ కన్వెన్షన్​ సెంటర్​ వేదికగా జరుగుతున్న భారత్​ సమ్మిట్​ చివరి రోజు కార్యక్రమాల్లో రాహుల్​ గాంధీ, సీఎం రేవంత్​ రెడ్డి పలు సమావేశాల్లో పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు, ప్రపంచ దక్షిణాది దేశాల మధ్య సహకారం వంటి అంశాలపై చర్చంచనున్నారు.

భేటీల అనంతరం 10.30 గంటలకు హైటెక్​ సిటీలోని శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్​ వరకు రాహుల్​, రేవంత్​ రెడ్డి గిగ్ వర్కర్లతో కలిసి ర్యాలీ నిర్వహస్తారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న గిగ్​ వర్కర్ల సంక్షేమ పథకాన్ని రాహుల్​ గాంధీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన (Rahul Gandhi) గిగ్​ వర్కర్లతో మాట్లాడతారు. రాహుల్​ పర్యటనతో రాష్ట్ర పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్​, సైబరాబాద్​ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు కానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>