కలం, వెబ్ డెస్క్ : అమెరికా వ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఆకస్మికంగా నిలిపివేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వైఫల్యం తలెత్తడంతో అధికారులు ఈ దేశవ్యాప్త గ్రౌండ్‌స్టాప్ (USA Flights Ground Stop) ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల భద్రతా కారణాల దృష్ట్యా దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి విమానాల బయలుదేరడాన్ని తక్షణమే ఆపివేశారు.
అయితే ఈ ఆదేశాల సమయంలో గాల్లో ప్రయాణిస్తున్న 4,042 విమానాలు సురక్షితంగా కిందకు దిగేందుకు అధికారులు అనుమతించారు. ఈ సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా 11 వేలకు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇందులో వెయ్యికి పైగా విమానాలు పూర్తిగా రద్దు కాగా, దాదాపు 10 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా చరిత్రలో ఇలా దేశవ్యాప్తంగా విమానాలను నిలిపివేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

