U-19 బాలికల క్రికెట్ జట్టుకు అండగా నిలిచిన బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో : జాతీయ స్థాయి అండర్-19 బాలికల క్రికెట్ పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న తెలంగాణ జట్టుకు ఎదురైన ప్రయాణ కష్టాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తక్షణమే పరిష్కరించారు. జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు తెలంగాణ నుండి 17 మంది బాలికల క్రికెట్ బృందం బయలుదేరింది. అయితే, ఢిల్లీ నుండి జమ్మూ కాశ్మీర్ వెళ్లే క్రమంలో అనివార్య కారణాల వల్ల ప్రయాణపరమైన ఇబ్బందులు తలెత్తాయి. సమయానికి పోటీలకు చేరుకోలేమోనని క్రీడాకారిణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

కరీంనగర్ బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు వేముల అనిల్ కుమార్ ద్వారా ఈ విషయం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి వెళ్లింది. సమాచారం అందిన వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి, సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి క్రీడాకారిణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ప్రయాణ ఏర్పాట్లు చేయించారు. ఆయన చొరవతో 17 మంది క్రీడాకారిణులు సకాలంలో, సురక్షితంగా జమ్మూ కాశ్మీర్‌కు చేరుకున్నారు.

తమ కష్టకాలంలో వెంటనే స్పందించి అండగా నిలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు తెలంగాణ అండర్-19 బాలికల క్రికెట్ జట్టు సభ్యులు, కోచ్‌లు , క్రీడాకారిణుల తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన కరీంనగర్ బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ వేముల అనిల్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>