అరటి తొక్కలతో అద్భుతం!.. కరీంనగర్ విద్యార్థినుల సత్తా!

కలం, కరీంనగర్ బ్యూరో : డిగ్రీ స్థాయిలో నిర్వహించిన ‘జిజ్ఞాస’ స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులో కరీంనగర్ ప్రభుత్వ మహిళా కళాశాల (Karimnagar College) విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించి సత్తా చాటారు. కెమిస్ట్రీ, తెలుగు విభాగాల్లో విద్యార్థులు రూపొందించిన రెండు వేర్వేరు ప్రాజెక్టులకు ఈ ప్రతిష్టాత్మక బహుమతులు లభించాయి. కెమిస్ట్రీ విభాగం లో డాక్టర్ రావుల మొగిలి పర్యవేక్షణలో “ప్రిపరేషన్ అండ్ ఫిజికో కెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ బయో డిగ్రేడబుల్ పాలిమర్ డిరైవ్డ్ ఫ్రమ్ బనానా పీల్” (అరటి తొక్కల నుండి పర్యావరణ అనుకూల బయో డిగ్రేడబుల్ పాలిమర్ తయారీ) అనే అంశంపై జారా ఫాతిమా, నవ్యశ్రీ, సిరి చందన, వందన, సమీక్ష బృందం ద్వితీయ బహుమతి గెలుచుకుంది. తెలుగు విభాగం లోకాజీపేట వెంకటరమణ పర్యవేక్షణలో “దాశరథి గీతాలు – ఉద్యమ స్ఫూర్తి” అనే అంశంపై ఆశ్రిత, కృపామణి, హస్మిత, అర్చన, రమ్య, కోమలత బృందం రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది.

విజేతలకు మేయర్ శ్రీనివాస్, ఎస్.ఆర్.ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. డిగ్రీ స్థాయి నుంచే ఇలాంటి ప్రాజెక్టులు చేయడం వల్ల విద్యార్థుల్లో పరిశోధన పట్ల ఆసక్తి పెరుగుతుందని, భవిష్యత్తులో మరిన్ని పెద్ద పరిశోధనలు చేసేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ, పీజీ తర్వాత పీహెచ్‌డీలో చేసే పరిశోధనలపై డిగ్రీ స్థాయి నుంచే అవగాహన పెంచుకోవడానికి జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి గైడ్‌లను కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి , అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>