కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల (RIMS)లో వైద్య విద్య, వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) ప్రత్యేక చొరవ, కృషి ఫలితంగా రిమ్స్‌కు అదనంగా 18 పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) వైద్య సీట్లు(18 More PG Seats) మంజూరయ్యాయి. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్‌తో పాటు వైద్యుల బృందం శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు.
పీజీ సీట్ల మంజూరుకు విశేష కృషి చేసిన కలెక్టర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. అదనపు పీజీ సీట్లతో రిమ్స్‌లో వైద్య విద్యావకాశాలు మెరుగుపడటంతో పాటు, భవిష్యత్తులో నిపుణులైన వైద్యుల తయారీకి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దోహదపడనుందని పేర్కొన్నారు.

