కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ కొత్త సీపీగా మహేష్ భగవత్ (Hyderabad CP Mahesh Bhagwat) బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని తన ఛాంబర్లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బదిలీ ఉత్తర్వులు వెలువడిన కేవలం 12 గంటల్లోనే ఆయన కొత్త బాధ్యతల్లోకి తీసుకోవడం విశేషం. ఈ సందర్భంగా సీపీ అవినీతి పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు.
సివిల్ మెంట్లలో తల దూర్చినా.. అవినీతికి పాల్పడినా సహించేది లేదని మహేష్ భగవత్ (CP Mahesh Bhagwat) స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు అంతర్రాష్ట్ర ముఠాలను వదిలేదని చెప్పారు. కాగా, ఇప్పటి వరకు హైదరాబాద్ సీపీగా సేవలందించిన సజ్జనార్.. ఫైర్, డిజాస్టర్ సర్వీసెస్ డీజీగా ట్రాన్స్ ఫర్ అయ్యారు.

