కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Telangana TET 2027) నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ నోటిఫికేషన్ కు రిలీజ్ చేశారు. పూర్తిగా ఆన్ లైన్ విధానంలో నిర్వహించే ఎగ్జామ్ కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 10 వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. జనవరి 3 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహిస్తుండగా.. డిసెంబర్ 28 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 8 వ తేదీ నుంచి 12 మధ్యలో టెట్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

