చిన్నారి మెడలో గొలుసు మాయం.. అసలు దొంగ ఎలా దొరికాడంటే?

కలం, ​మధిర: అపార్ట్‌మెంట్లలో నిఘా నేత్రాలు(సీసీ కెమెరాలు) ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు పదేపదే చెబుతున్నా.. ఆర్థిక భారమంటూ నిర్లక్ష్యం వహించే వారికి కనువిప్పు కలిగించే ఘటన మధిర పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఒక అపార్ట్‌మెంట్లో బిగించిన సీసీ కెమెరాలు, ఏకంగా రూ.3 లక్షల విలువైన బంగారు గొలుసు దొంగతనం (Madhira Theft) కేసును గంటల్లోనే ఛేదించి బాధితులకు ఊరటనిచ్చాయి.

ఖమ్మం జిల్లా ​మధిర పట్టణంలోని ఒక అపార్ట్‌మెంట్లో నివాసముంటున్న కుటుంబం బుధవారం రాత్రి తమ నివాసంలో అయ్యప్ప పడి పూజ భజన కార్యక్రమాన్ని నిర్వహించింది. బంధుమిత్రులు, ఇరుగుపొరుగు వారితో ఆ ప్రాంగణమంతా సందడిగా ఉంది. అందరూ భజనలో నిమగ్నమై ఉన్న సమయంలో, అక్కడికి వచ్చిన ఒక యువకుడు ఆడుకుంటున్న చిన్నారి (నివాసితుల మనవడు) మెడలోని సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు గొలుసును అపహరించి అక్కడి నుంచి జారుకున్నాడు. ​

భజన ముగిసిన అనంతరం చిన్నారి మెడలో గొలుసు లేకపోవడాన్ని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆందోళనకు గురైన వారు వెంటనే అపార్ట్‌మెంట్లో ఇటీవలే ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అందులో సదరు యువకుడు గొలుసు దొంగిలిస్తున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు స్పష్టంగా రికార్డయ్యాయి. ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అతని ఇంటికి వెళ్లి నిలదీశారు. మొదట తనకేమీ తెలియదని బుకాయించిన ఆ యువకుడు.. బాధితులు తమ వద్ద ఉన్న సీసీ కెమెరా వీడియోను చూపించడంతో కంగుతిన్నాడు. తప్పు ఒప్పుకుని వెంటనే తన జేబులో ఉన్న బంగారు గొలుసును తీసి బాధితులకు అప్పగించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>