అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ప్రత్యేక రైళ్ల బుకింగ్

కలం, వెబ్ డెస్క్ : శబరిమల అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మొత్తం 54 ప్రత్యేక రైళ్ల (Sabarimala Trains)ను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్ ప్రక్రియ నవంబర్ 13, 2026 ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నాందేడ్ – కొల్లం (07189), హైదరాబాద్ – కొల్లం (07193) వీక్లీ ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి రానుంది. వీటితో పాటు చర్లపల్లి – కొల్లం మార్గంలో నడిచే 07180, 07195, 07197, 07199 నంబర్ల ప్రత్యేక రైళ్ల టికెట్లను కూడా భక్తులు నేటి ఉదయం 8 గంటల నుంచే బుక్ చేసుకోవచ్చు. అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>