కలం, వెబ్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో (IND vs NZ) భారత్ టాస్ నెగ్గింది. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కివీస్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. ముగ్గురు ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం కల్పించినట్లు సమాచారం.
జట్టు కొత్త కూర్పుతో బరిలోకి దిగుతున్న భారత టీమ్.. బౌలింగ్‌లో సత్తా చాటి న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 5 వన్డే సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న ఇండియా.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌పై పట్టు బిగించాలని డిసైడ్ అయింది. మరోవైపు సొంతగడ్డపై భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని కివీస్ టీమ్ భావిస్తోంది.

