“ఇక సెలవు”.. సీపీ సజ్జనార్​ భావోద్వేగ పోస్ట్​

కలం, వెబ్​ డెస్క్​: బదిలీపై సీపీ వీసీ.సజ్జనార్ (VC Sajjanar)​ స్పందించారు. హైదరాబాద్​ సీపీగా సేవలందించిన ఆయన ఫైర్​, డిజాస్టర్ సర్వీసెస్​ డీజీగా ట్రాన్స్​ ఫర్​ కావడంపై బావోద్వేగ పోస్ట్​ పెట్టారు. గడిచిన ఏడాది కాలం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అపురూపమైన ప్రయాణం అని పేర్కొన్నారు. హైదరాబాద్ సీపీగా సేవ చేసే అవకాశాన్ని కల్పించిన సీఎం రేవంత్​ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, హైదరాబాద్ నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించబోతున్న మహేష్ భగవత్ కు సజ్జనార్​ అభినందనలు తెలియజేశారు.

ఏడాది కాలంలో హైదరాబాద్​ ప్రజలు తన తో పాటు పోలీస్​ వ్యవస్థపై చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని సజ్జనార్​ (VC Sajjanar) ధన్యవాదాలు తెలిపారు. మత సామరస్యానికి ప్రతీక అయిన హైదరాబాద్​ లో ప్రజలంతా కలిసిమెలిసి పండగలను ఘనంగా జరుపుకోవడం తన మనసును ఎంతగానో కదిలించిందని ఆయన​ పేర్కొన్నారు. ప్రజల క్షేమమే పరమావధిగా పని చేశామన్నా సజ్జనార్​.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీపై ‘హెచ్-ఫాస్ట్’ ద్వారా ఉక్కుపాదం మోపినట్లు చెప్పారు.

సైబర్ నేరాల కట్టడి కేవలం పోలీసుల వల్లే కాదని గుర్తించి.. ప్రజల్లో చైతన్య తీసుకువస్తూనే బ్యాంకులు, DoT వంటి విభాగాలను సమన్వయం చేస్తూ దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ ఆక్టోపస్’కు శ్రీకారం చుట్టామన్నారు సజ్జనార్​. బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా కేసుల దర్యాప్తు కోసం ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’ ను ప్రారంభించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లామని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో చేపట్టిన ‘డే విత్ సీపీ’ కార్యక్రమం తనకు ఎంతో ఆత్మసంతృప్తిని మిగిల్చిందని ఆయన​ రాసుకొచ్చారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం గురువారం 21 మంది సీనియర్​ ఐపీఎస్​ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ స్థానంలో మహేశ్​ భగవత్​ ను నియమించింది. సజ్జనార్​ ను ఫైర్​, డిజాస్టర్​ సర్వీసెస్​ డీజీగా ట్రాన్స్​ ఫర్​ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>