ఏపీకి గుడ్ న్యూస్.. కియా భారీ పెట్టుబడి

కలం, వెబ్ డెస్క్: ఏపీకి భారీ శుభవార్త. కియా మోటార్స్ (KIA Motors) సంస్థ రూ.18 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు విశాఖ సీఐఐ సదస్సులో కియా సంస్థతో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఇప్పటికే ఉన్న ప్లాంట్‌ను విస్తరిస్తూ మరో 465 ఎకరాల్లో రెండో ప్లాంట్ నిర్మించేందుకు అంగీకారం జరిగింది. 2030 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించారు. 2029 నాటికే ప్లాంట్ పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కోరగా.. కియా ప్రతినిధులు అంగీకరించారు. ఈ పెట్టుబడులతో స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల మరింత పెరగడంతో పాటు కియా కార్ల ఉత్పత్తిలో ఏపీ ప్లాంట్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

పలు కంపెనీలతో ఒప్పందాలు..

విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సు(CII Summit)లో భాగంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. SLN కాఫీ సంస్థ అధినేత ఎన్.సతప్పన్ రూ.3,500 కోట్లతో ఏపీలో కొత్త ప్లాంట్ నిర్మాణానికి ముందుకొచ్చారు. ఇది కర్ణాటక బయట నిర్మించబోయే మొదటి ప్లాంట్ అని, దీని ద్వారా సుమారు 3 వేల ఉద్యోగాలు రాబోతున్నట్లు మంత్రి లోకేశ్ (Nara Lokesh) ప్రకటించారు. వాల్‌మార్ట్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. ఇక దక్షిణ ఆసియాలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్‌ను ఫిబ్రవరి 3న అమరావతిలో ఘనంగా ప్రారంభించబోతున్నామని, భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్లు ఇక్కడే తయారవుతాయని వివరించారు.

Also Read : క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ నటి మోనాల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>