కలం, కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా గురువారం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు విలీన గ్రామాల డివిజన్లలో పర్యటించారు. కొత్తపల్లి, మల్కాపూర్, చింతకుంట ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. సీఎస్ఆర్ మలయప్ప పౌండేషన్కు (CSR Funds) చెందిన మొత్తం 21 లక్షల నిధులతో మూడు పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థు సౌకర్యార్ధం అందమైన మరుగు దొడ్లను (Modern Toilets) నిర్మాణం చేశారు.
ఇందులో భాగంగా మొదటగా మల్కాపూర్ పాఠశాలలో 7 లక్షలతో నిర్మాణం చేసిన మాడ్రన్ మరుగుదొడ్లను కార్పోరేటర్ కాంతాల జగన్ రెడ్డి తో కలిసి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభం చేశారు. అనంతరం కొత్తపల్లి పాఠశాలో కార్పోరేటర్లు వాసాల రమేష్, వేముల కవిత చంద్ర శేఖర్ తో కలిసి ప్రారంభం చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు ఇగ్లీష్ డిక్షనరీలను మేయర్, డిప్యూటీ మేయర్లు తన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం చింతకుంట శాంతినగర్ పాఠశాలలో కార్పోరేటర్ విప్పల సాయి జ్యోతితో కలిసి మరుగు దొడ్లను ప్రారంభం చేశారు.
మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు విద్యార్థులతో కలిసి ముచ్చటించి… విద్యాభ్యాసం వివరాలు, వసతి సౌకర్యాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పదో తరగతి విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తమ సొంత నిధుల నుండి పరీక్ష ఫీజును చెల్లించినందుకు పాఠశాలల పదోతరగతి విద్యార్థిని విద్యార్థులు కేంద్ర మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో నగరంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనే ద్యేయంగా సీఎస్ఆర్ మలయప్ప పౌండేషన్ నిధులను కేటాయించి చక్కటి మరుగు దొడ్లను నిర్మాణం చేసి ప్రారంభించడం దరిగిందని తెలిపారు. ఇప్పటికే నగరపాలక సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునీకరణ పనులు చేపట్టి విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అధునిక విద్యాబోధన నేపథ్యంలో ఈ క్లాస్ రూంలు, కంప్యూటర్లు ఏర్పాటు చేశామన్నారు. పలు పాఠశాలలను అధునీకరించి.. ఫర్నిచర్, మరుగుదొడ్లను తదితర మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.
గతంలో మాదిరిగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో పదో తరగతి విద్యార్థులకు త్వరలోనే సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు సౌకర్యాలను వసతులను సద్వినియోగం చేసుకుని చక్కటి విద్యాభోదనతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. వచ్చే పదో తరగతి పరిక్షల్లో మంచి జీపిఏలు సాధించి కరీంనగర్ ను రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ బండ రమణారెడ్డి, గాజ రమ శివరాం, బీజేపీ నాయకులు హరిష్, శివకుమార్, సత్యనారాయణ రెడ్డి, కొమురయ్య, విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

