సోనియా పుస్తకం కాల్చేశారు.. ఎందుకంటే?

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని (Sonia Gandhi Book) 1984 సిక్కు అల్లర్లలో మరణించినవారి కుటుంబ సభ్యులు కాల్చేసి తమ నిరసన తెలియజేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అల్లర్లపై సోనియా గాంధీ పూర్తిగా అబద్దాలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సిక్కు సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అల్లర్లను కంట్రోల్ చేయాలని ఆర్మీని నవంబర్ ఒకటో తేదీనే ఆదేశించినా.. నవంబర్ రెండో తేదీ సాయంత్రం నాటికే సైన్యం ఢిల్లీ చేరుకుందని రాశారని తెలిపారు.

భారత ప్రభుత్వం నియమించిన మిశ్రా కమిషన్ మాత్రం అల్లర్లు జరిగిన సమయంలో ఢిల్లీలో 5 వేల మంది భద్రతా సిబ్బంది ఉన్నా.. వారిని మోహరించలేదని రిపోర్ట్ చేసిందన్నారు. ఒకవేళ ఆర్మీ జోక్యం చేసుకుంటే రెండు వేల మంది సిక్కులు బతికి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను సోనియా తన పుస్తకంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

సోనియా ఏం రాశారంటే..

ఇందిరా గాంధీ (Indira Gandhi) హత్య అనంతరం 1984లో ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్లలో సుమారు 2 వేల మందికి పైగా సిక్కులు మరణించారు. ఇది అత్యంత విషాదకరమైన, దేశానికే సిగ్గుచేటు లాంటి ఘటన అని సోనియా తన బయోగ్రఫి ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో రాశారు. అమాయక సిక్కులపై దాడులు చేయాలని రాజీవ్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఆదేశాలివ్వలేదని, ఆయనకు మతద్వేషం లేని వ్యక్తిగా పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారుల అసమర్థత, సమన్వయం లేకపోవడంతోనే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలోనే, అల్లర్లకు కాంగ్రెస్, రాజీవ్ కారణం కాదంటూ సోనియా చెప్పడాన్ని బాధిత కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. తాజాగా ఆమె పుస్తకాలను (Sonia Gandhi Book) కాల్చేశారు.

Also Read : రూ.7 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం.. కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>