తెలంగాణ వ్యాప్తంగా ‘కొత్త పింఛన్ల’ పత్రాల పంపిణీ

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా కొత్త చేయూత పింఛన్ల మంజూరుపై పండుగ వాతావరణం నెలకొంది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కొత్త పింఛన్ మంజూరు కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ (Telangana New Pension) కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తున్నారు. ఈ నెల 18 వరకు అన్ని నియోజకవర్గాల్లో మంజూరు పత్రాల పంపిణీ జరుగనుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న నూతన లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు చెల్లించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో మరో 4.5 లక్షల మందికి రేవంత్ సర్కార్ కొత్తగా చేయూత పింఛన్లు (Cheyutha New Pension) మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 1,23,625 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయగా.. తాజాగా మరో 4.5 లక్షల మందికి మంజూరు చేసింది. దీంతో తమ ప్రభుత్వ హాయంలో కొత్తగా పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య మొత్తం 5,73,625కు చేరినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పింఛన్ పంపిణీ కార్యక్రమాలు నిర్విరాటంకంగా జరిగేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి.

Also Read : తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>