కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027 (IPL 2027) వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి నిర్ణయంతో ఫ్రాంచైజీ యాజమాన్యం గందరగోళం పడినట్లు కనిపిస్తోంది. దాంతో వెంటనే బుజ్జగింపు చర్యలు కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. గత రెండు సీజన్లలో అక్షర్ సారథ్యంలో ఢిల్లీ (Delhi Capitals) జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. కెప్టెన్సీ ఒత్తిడి వల్ల అతని వ్యక్తిగత ప్రదర్శన కూడా దెబ్బతింది. ఐపీఎల్ 2026లో ఆడిన 14 మ్యాచ్‌లలో అక్షర్ కేవలం 173 పరుగులు చేసి, 11 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
అయితే, అక్షర్‌ను జట్టులో కొనసాగించేందుకు ఢిల్లీ యాజమాన్యం గట్టిగా ప్రయత్నిస్తోంది. అతని కోసం ఇతర ఫ్రాంచైజీలు భారీ ట్రేడ్ ఆఫర్లు ఇచ్చినా ఢిల్లీ తిరస్కరించింది. అక్షర్ (Axar Patel) జట్టుకు ఎంతో కీలకమని, వేలం పూర్తయ్యే వరకు కెప్టెన్సీపై తుది నిర్ణయం తీసుకోమని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. కానీ ఎందుకో అక్సర్ మాత్రం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి చివరకు ఢిల్లీ కెప్టెన్సీ ఏమవుతుందో అన్న చర్చ కూడా మొదలయింది. ఇదిలా ఉంటే మరోవైపు, డిసెంబర్‌లో జరగనున్న వేలానికి ముందు ఢిల్లీ జట్టులో భారీ మార్పులు జరిగాయి.
సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా, యువరాజ్ సింగ్, చమిందా వాస్, అమిత్ మిశ్రా సపోర్ట్ స్టాఫ్‌గా చేరారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో రెండు సీజన్ల తర్వాత స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ కూడా తిరిగి ఢిల్లీ గూటికి చేరుకున్నాడు. రాబోయే సీజన్‌కు ముందు జట్టులో మరిన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
Also Read : పొట్టుపొట్టు కొట్టుకున్న ఫైటర్లు.. అబుదాబిలో మెరాబ్‌పై ఉస్మాన్ దాడి
Follow Us On : WhatsApp

