కలం, మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ నగరంలోని శ్రీ చంద్ర కాలనీ, ఏనుగొండలో నిర్మించనున్న శ్రీ శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమానికి (Temple Foundation Ceremony ) ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆలయ నిర్వాహకులు ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆయనకు తెలియజేశారు.

