కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మధ్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈడీ తెలంగాణ కోర్టును ఆశ్రయించింది. ఇద్దరూ బెయిల్ పై బయట ఉండడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ పిటిషన్ లో పేర్కొంది. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించనుంది.
కాగా, ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case) లో ఈడీ దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా నిందితుల బెయిల్ రద్దుకు పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం చేపట్టనున్న విచారణలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందని ఆసక్తికరంగా మారింది. కాగా, రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి ఈడీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

